రిపబ్లిక్ డే: పంజాబ్‌లో భారీ కుట్ర భగ్నం.. 3.79 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (11:43 IST)
రిపబ్లిక్ డేను పురస్కరించుకుని దేశంలో భారీ భద్రత కొనసాగుతోంది. రిపబ్లిక్ వేడుకల సమయంలో భారత్‌లో విధ్వంసం కలిగించేందుకు జైష్ ఏ మహ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్, లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్ర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. 
 
ఇటీవల ఢిల్లీలో ఓ ప్రాంతంలో కూడా పేలుడు పదార్థాలు దొరకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే భద్రతా బలగాలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు నిఘాను పటిష్ట పరుస్తున్నాయి.
 
తాజాగా పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్ గురుదాస్ పూర్‌లో ఓ గ్రెనెడ్ లాంఛర్, 3.79 కిలోల ఆర్డీఎక్స్, 9 డిటోనేటర్లు, 2 సెట్ల టైమర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
పాకిస్థాన్‌కు చెందిన సిక్ యూత్ ఫెడరేషన్ నుంచి ఈ పేలుడు పదార్థాలు భారత్‌కు చేరి ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. టెర్రరిస్టులతో లింకులు ఉన్నా మల్కీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments