Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూడొద్దని తల్లి మందలించింది.. అంతే బాలుడు ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (16:42 IST)
watching TV
పాఠశాలలు సెలవులు, లాక్ డౌన్ కారణంగా పిల్లలు ఇంటి పట్టునే వుంటున్నారు. అయితే టీవీలకే అతుక్కుపోతున్నారు. అలా గంటల తరబడి టీవీ చూస్తున్నందుకు తల్లి మందలించిందనే కారణంతో ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల బాలుడు రోజూ గంటల తరబడి టీవీలో కార్టూన్లు చూస్తున్నాడు. 
 
ఈ విషయంలో తల్లి ఎన్నిసార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం టీవీ చూస్తున్న బాలుడిని కాస్త గట్టిగానే మందలించిన తల్లి...టీవీని ఆఫ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించినా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అతని కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షణికావేశంతో బాలుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు చెప్పారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments