Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో దారుణం.. దారి చూపిస్తానని నమ్మించి విద్యార్థినిపై అత్యాచారం!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (17:12 IST)
మహారాష్ట్రలోని పూణెలో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. దారి తెలియని ఓ విద్యార్థిని నమ్మించి.. దారి చూపిస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడో 32 యేళ్ల కామాంధుడు. పూణెలోని బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్ వద్ద నివసిస్తున్న తన స్నేహితురాలిని కలుసుకునేందుకు 18 యేళ్ల విద్యార్థిని వచ్చింది. స్నేహితురాలు చెప్పిన అడ్రస్ ప్రకారం మాల్దాక్కా చౌక్ ప్రాంతానికి చేరుకున్నాక దారి మర్చిపోయింది. దీంతో అక్కడే ఉన్న నావల్ జోసఫ్ (32) అనే వ్యక్తిని సాయం కోరింది. 
 
అడ్రస్ తనకు తెలుసని, స్నేహితురాలిని చేరేందుకు దారి చూపిస్తానని నమ్మబలికి ఆమెను ఖడ్కీ ప్రాంతంలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఎవరికైనా చెబితే పరువు తీస్తానంటూ సెల్ ఫోన్‌లో అభ్యంతరకరమైన రీతిలో ఫోటోలు తీశాడు. ఆ కామాంధుడి బారినుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, కామాంధుడుని అరెస్టు చేశారు. ఈ అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి మాజీ బౌన్సర్‌ అని పోలీసులు గుర్తించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments