Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి పదవీగండం... రహస్యంగా పూజలు?!

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామికి పదవీగండం పొంచివునట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన రహస్యంగా ప్రత్యేక పూజలు చేసినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తమ గె

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (11:31 IST)
పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామికి పదవీగండం పొంచివునట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన రహస్యంగా ప్రత్యేక పూజలు చేసినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తమ గెలుపును అడ్డుకునేందుకు అన్నాడీఎంకే కుట్ర పన్నుతోందని బహిరంగంగా ఆరోపించడం రాజకీయ పార్టీల మధ్య కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఏకగ్రీవంగా పుదుచ్చేరి సీఎం బాధ్యతలను నారాయణస్వామి చేపట్టారు. అయితే మరో ఆరు నెలల్లో ఆయన ఏదైనా నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
 
దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యే జానకుమార్‌ (నెల్లికుప్పం సెగ్మెంట్)తో రాజీనామా చేయించి, అక్కడ నుంచి పోటీకి దిగుతున్నారు. అయితే, అక్కడ నుంచి అన్నా డీఎంకేకు చెందిన ఓం శక్తిశేఖర్‌ నామినేషన్ దాఖలు చేయడంతో గట్టిపోటీ నెలకొంది. తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆదివారం అమావాస్య సందర్భంగా పుదుచ్చేరిలో ప్రసిద్ధి చెందిన ఎల్లయమ్మన్ ఆలయంలో అర్థరాత్రి ప్రత్యేక పూజలు, యాగం నిర్వహించారు.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments