Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక టార్గెట్ మధ్యప్రదేశ్ : చౌహాన్ సర్కారులో ప్రతినెలా ఓ స్కామ్ : ప్రియాంకా గాంధీ

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (11:21 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయభేరీ మోగించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఇందుకోసం ఆ పార్టీ మహిళా నేత ప్రియాంకా గాంధీని రంగంలోకి దిగారు. ఆమె జబల్‌పూర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన ప్రచారంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
చౌహాన్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రతి నెలా ఓ స్కాం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 225 కుంభకోణాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. రేషన్ పంపిణీ, గనులు, ఈ-టెండర్లు, కరోనాపై పోరు తదితరాల్లో అవినీతి జరిగిందన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, మహిళలకు నెలకు రూ.1,500 నగదు ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండరు, 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని, పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తామని. రైతు రుణాలు మాఫీ చేస్తామంటూ అనేక వరాలు కురిపించారు. పైగా, గత మూడేళ్లలో మధ్యప్రదేశ్‌లో కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలే ఇచ్చారంటూ ప్రియాంకా ఘాటు విమర్శలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments