చిదంబరానికి మేం అండగా ఉంటాం : ప్రియాంకా గాంధీ

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (16:16 IST)
ఐఎన్ఎక్స్ కేసులో కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం అరెస్టుకు సీబీఐతో పాటు.. ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నాయి. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన అరెస్టు తథ్యంగా కనిపిస్తోంది. 
 
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందించారు. చిదంబరంతో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నో ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. 
 
దశాబ్దాలుగా దేశానికి చిదంబరం సేవ చేశారని... కేంద్ర ఆర్థిక, హోం మంత్రిగా బాధ్యతలను నిర్వహించారని చెప్పారు. నిజాలను నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయన నైజమని... కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగడుతున్నారని అన్నారు. కొందరు పిరికిపందల వల్ల నిజాలు మాట్లాడే వారిపై నిందలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు.
 
చిదంబరం పట్ల సీబీఐ అవమానకరంగా ప్రవర్తిస్తోందని ప్రియాంక విమర్శించారు. ఆయనకు తామంతా మద్దతుగా నిలుస్తామని... ఎన్ని అడ్డంకులు ఎదురైనా బెదరబోమని... న్యాయం కోసం పోరాడుతామని ప్రియాంకా గాంధీ మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments