ప్రియా వారియర్‌కు సీపీఐ మద్దతు.. ఆ రకం పోస్టర్లు వచ్చేశాయ్..

సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్‌కు కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) మద్దతుగా నిలిచింది. ''ఒరు ఆదార్ లవ్'' చిత్రంలోని ఓ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ ప్రదర్శిం

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (18:10 IST)
సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్‌కు కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) మద్దతుగా నిలిచింది. ''ఒరు ఆదార్ లవ్'' చిత్రంలోని ఓ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ ప్రదర్శించిన హావభావాలు వివాదాస్పదమైన నేపథ్యంలో.. సీపీఐకి అనుబంధంగా ఉన్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) తమ పార్టీ రాష్ట్ర సమావేశానికి ఆమె పోస్టర్ల ద్వారా ప్రచారం కల్పిస్తోంది.
 
ప్రియా వారియర్ హావభావాలతో ఆ సినిమాలోని పాట వివాదాస్పదం కావడం, ఆపై ఆమెపై దేశంలోని పలుచోట్ల కేసులు నమోదు కాగా సుప్రీంకోర్టు వాటిపై స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐఎస్ఎఫ్ ''ఒరు అదార్ లవ్'' సినిమా పోస్టర్లను తలపించే విధంగా డిజైన్ చేసింది. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
కాగా సీపీఐ కేరళ రాష్ట్ర సమావేశం మలప్పురంలో ప్రారంభమైనాయి. ఈ సమావేశం ప్రారంభానికి చాలాకాలం ముందు నుంచే ప్రియా వారియర్ పోస్టర్లు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ నెల 1 నుంచి 4 వరకు ఈ సమావేశాలను నిర్వహిస్తారు. ఈ సమావేశాల ప్రచారం కోసం ''ఒరు అదార్ లవ్''లో ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటే లుక్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments