Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్టులో చిక్కుకుపోయిన పృథ్వీరాజ్ చవాన్.. 45 నిమిషాలు లిఫ్టులోనే..?

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (13:04 IST)
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విపత్కర పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ముంబైలోని చర్చిగేటు వద్ద ఉన్న తన కార్యాయానికి వెళ్లిన సందర్భంగా ఆయన లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు.
 
ఏ ఐదో, పది నిమిషాలో అయితే పర్వాలేదు కాని ఏకంగా 45 నిమిషాల పాటు ఆయన లిఫ్ట్ లోనే చిక్కుబడిపోయారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగితే కాని ఆయన సురక్షితంగా బయటపడలేకపోయారు.
 
మొదటి అంతస్థులోనే ఉన్న తన కార్యాలయానికి వెళ్లేందుకు చవాన్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ దత్‌తో కలిసి లిఫ్ట్ ఎక్కారు. చవాన్ ఎక్కిన మరుక్షణమే సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా లిఫ్ట్ నిలిచిపోయింది. దీంతో చవాన్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 
 
లిఫ్ట్‌ను తెరిచేందుకు చవాన్‌తో పాటు ఆయన భద్రత సిబ్బంది చేసిన యత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని లిఫ్ట్‌ను తెరిచారు. దీంతో చవాన్ సురక్షితంగా బయటపడ్డారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments