తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ ఇటీవలే దారుణంగా హత్యకు గురైన ఘటన మరవకముందే.. జయమ్మ మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే సేలం జిల్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ ఇటీవలే దారుణంగా హత్యకు గురైన ఘటన మరవకముందే.. జయమ్మ మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే సేలం జిల్లాలోనికి అత్తూరులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇతడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెప్పారు. అయితే కనకరాజుది హత్యేనని అమ్మ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో ఇటీవల జరిగిన సెక్యూరిటీ హత్యకు కనకరాజు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు శనివారం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అతడు రోడ్డుప్రమాదంలో చనిపోవడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
కొడనాడు ఎస్టేట్ కాపలదారు ఓంకార్‌ను ఇటీవల కొందరు దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24న అర్ధరాత్రి సమయంలో పది మంది దుండగులు రెండు వాహనాల్లో ఎస్టేట్‌లోపలికి చొరహడి.. ఓంకార్, కిషన్ బహదూర్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓంకార్ అక్కడికక్కడే మృతిచెందగా.. కిషన్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే జయలలిత ఆస్తులు, అన్నాడీఎంకేకు సంబంధించిన కీలక దస్త్రాలు ఈ ఎస్టేట్‌లోనే ఉంటాయని ప్రచారం ఉంది.
దీంతో దస్త్రాల కోసం దుండగులు చొరబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాజీ డ్రైవర్ కనకరాజ్ కూడా అనుమానస్పద రీతిలో హత్యకు గురవడం పలు అనుమానాలకు దారితీసింది. కనకరాజు గతంలో చిన్నమ్మకు వ్యతిరేకంగా పలు ఆరోపణలు చేశాడని.. జయమ్మను చంపేసింది ఆమేనని చేసిన కామెంట్సే అతని అనుమానాస్పద మృతి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఈ హత్యకు కనకరాజు కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. జయలలిత దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆమె పేరును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2012లో కనకరాజును ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత కొయంబత్తూర్‌లోని ఓ బేకరీలో పనికి కుదిరాడు. అయతే అక్కడే త్రిశూర్‌కు చెందిన సయన్ అనే వ్యక్తితో స్నేహం చేసి కొడనాడ్ ఎస్టేట్‌ను దోచుకునేందుకు పథకం రచించినట్లు పోలీసులు చెబుతున్నారు.ఈ మేరకు ఏప్రిల్ 24న తన అనుచరులతో కలిసి ఎస్టేట్‌లోకి చొరబడి కాపలాదారుడిని హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు కనకరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇదే సమయంలో కనకరాజు రోడ్డు ప్రమాదంలో మరణించడం పలు అనుమానాలకు దారితీస్తోంది.