Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రకటించిన ప్రధాని మోడీ

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (10:39 IST)
చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో స్వదేశీ యాప్‌ల కోసం నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చింగారీ యాప్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా దేశీయంగా యాప్‌ల రూపకల్పన, అభివృద్ధి అంశాల్లో ఇన్నొవేషన్ చాలెంజ్ ప్రకటించింది.
 
ఈ ఛాలెంజ్ రెండు రకాలుగా ఉంటుంది. ట్రాక్-1, ట్రాక్-2 అంటూ విభజించారు. ఇప్పటికే దేశీయంగా వాడుకలో ఉన్న యాప్‌ల కోసం ట్రాక్-1, దేశంలో కొత్త యాప్‌లు రూపొందించగల సత్తా ఉన్న ఔత్సాహికుల కోసం ట్రాక్-2 చాలెంజ్‌ను ప్రకటించారు. 
 
వర్క్ ఫ్రమ్ హోమ్, సోషల్ మీడియా, ఈ-లెర్నింగ్, క్రీడలు, వార్తలు, ఆర్థిక సాంకేతికత, అగ్రిటెక్, హెల్త్, వినోదం, ఆఫీస్ ప్రొడక్టివిటి అంశాల్లో యాప్‌లు రూపొందించాల్సి ఉంటుంది.
 
ట్రాక్-1, ట్రాక్-2 రెండు విభాగాల్లో మూడేసి బహుమతులు ఇవ్వనున్నారు. ఫస్ట్ ప్రైజ్ రూ.20 లక్షలు, సెకండ్ ప్రైజ్ రూ.15 లక్షలు, మూడో బహుమతి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. ఇతర విభాగాల్లోనూ మరికొన్ని బహుమతులు ఉన్నాయి. 
 
నీతి ఆయోగ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ఈ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నాయి. జూలై 4 నుంచి ఈ ఛాలెంజ్ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 18 లోపు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments