Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గనున్న టీవీల ధరలు

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:33 IST)
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దీంతో ఇండియాలో తయారయ్యే ఎల్ఈడీ, ఎల్సీడి టీవీ ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లను ఎల్ఈడీ, ఎల్సీడి టీవీల్లో ఉపయోగిస్తారు. అయితే వీటిపై ప్రస్తుతం 5 శాతం సుంకం వసూలు చేస్తుండగా.. తాజాగా దీనిని పూర్తిగా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో టీవీ రేట్లు కొంతమేరకు తగ్గుతాయని అంటున్నారు.

వీటితోపాటు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, ఫిల్మ్ చిప్ లపై కూడా దిగుమతి సుంకాన్ని రద్దు చేశారు. ఎల్ఈడీ, ఎల్సీడి టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానళ్లు అతి ముఖ్యమైనవి.. టీవీ తయారీలో సగం ఖర్చు దీనిపైనే వెచ్చించాల్సి ఉంటుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎల్ఈడీ, ఎల్సీడి టీవీల తయారీ ఖర్చు తగ్గనుంది. అలాగే టీవీ అమ్మకం ధరలు కూడా తగ్గవచ్చు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments