Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా సాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

Webdunia
గురువారం, 21 జులై 2022 (11:41 IST)
భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. పార్లమెంట్ భవనంలో సాగుతున్న ఈ ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత విజేతను ప్రకటిస్తారు. 
 
ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత ఎంపీల ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డరులో రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు చేపడుతారు. మొత్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. అంటే సాయంత్రం 4 గంటల సమయంలో తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉంది. 
 
ఈ నెల 18వ తేదీన జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీపడుతున్నారు. వీరిలో ద్రౌపది ముర్ముకే అధిక విజయావకాశాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగుస్తుంది. 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments