Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కాంగ్రెస్‌కు మరోమారు ఘోర పరాభవం... మీరా కుమార్‌కు '0' ఓట్లు

తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా పార్లమెంట్‌ హౌస్‌లో పోలైన ఓట్లతో పాటు.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, అసొం, బీహార్‌లతో కలుపుకుని మొత్తం 11 రాష్ట

Webdunia
గురువారం, 20 జులై 2017 (15:48 IST)
తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా పార్లమెంట్‌ హౌస్‌లో పోలైన ఓట్లతో పాటు.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, అసొం, బీహార్‌లతో కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు వేసిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. 
 
ఇందులో ఎన్డీయే అభ్యర్థి రాంనాథ్ కోవింద్‌కు 60,683 ఓట్లు రాగా, ఆయనకు పోటీగా యూపీఏ తరపున పోటీ చేసిన మీరా కుమార్‌కు 22,941 ఓట్లు లభించాయి. అయితే, ఏపీలో రాంనాథ్‌కు మొత్తం 27189 ఓట్లు రాగా, మీరా కుమార్‌కు ఒక్క ఓటు కూడా దక్కలేదు. అంటే కాంగ్రెస్‌కు మరోమారు ఘోర పరాభవం ఎదురైంది. దీనికి కారణం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ లేదా ఎమ్మెల్యే లేకపోవడమే.  
 
కాగా, ఇప్పటివరకు పార్లమెంట్‌తో పాటు 11 రాష్ట్రాల్లో పోలైన ఓట్లను లెక్కించగా, ఎన్డీయే అభ్యర్థి రాంనాథ్‌కు 1389 ఓట్లు పోలయ్యాయి. వీటి విలువ 4,79,585గా ఉంది. అలాగే, యూపీఏ అభ్యర్థి మీరా కుమార్‌కు 576 ఓట్లు పోలయ్యాయి. వీటి విలువ 2,04,594గా ఉంది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments