Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న తిరుమలకు రాష్ట్రపతి

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (07:41 IST)
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శ్రీవారి దర్శనార్ధం ఈ నెల 24న తిరుమలకు రానున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు.

ఈ నెల 24వ తేదీన ఉదయం 10.45 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి తిరుపతికి చేరుకుంటారన్నారు.

అక్కడి నుంచి కారులో బయలుదేరి 11.40 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకుంటారని, మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళతారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలుకనున్నారు.
 
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన వివరాలు..
ఈ నెల 24న ఉదయం 10.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం. 11 గంటల 40 నిమిషాలకు తిరుమల చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస. 12 గంటల 40 నిమిషాలకు శ్రీవారి దర్శనం. 1:50 నిమిషాలకు తిరిగి పద్మావతి అతిథి గృహం చేరుకుని విశ్రాంతి. 3.15 నిమిషాలకు తిరుమల నుంచి తిరుపతి విమానాశ్రయానికి పయనం. 4.10గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ కు పయనం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments