Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత యువకుడి శిరోమండనంపై రాష్ట్రపతి సీరియస్... విచారణాధికారి నియామకం

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (15:40 IST)
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో స్వయంగా ఖాకీలో ఓ దళిత యువకుడికి శిరోమండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక విచారణాధికారిని కూడా ఆయన నియమించారు. ఈ విచారణాధికారిని కలిసి పూర్తి వివరాలు సమర్పించాలని బాధితుడికి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఓ సందేశం వచ్చింది. 
 
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ఇడుగుమిల్లి ప్రసాద్ అనే ఓ దళిత యువకుడికి పోలీసులు శిరోమండనం చేశారు. స్థానిక వైకాపా నేత ఒత్తిడి మేరకు పోలీసులు దగ్గరుండిమరీ ఈ పని చేయించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో చాలా సీరియస్ అయింది. దీంతో ఈ వికృత చర్యకు పాల్పడిన పోలీసులపై శాఖాపరమైన చర్యలను ఏపీ పోలీస్ శాఖ తీసుకుంది. 
 
ఈ క్రమంలో తనకు న్యాయం జరగలేదనీ, అందువల్ల మావోయిస్టుల్లో చేరి నా పరువు నేనే కాపాడుకుంటా అంటూ ఆ దళిత యువకుడు వాపోతున్నాడు. ఈ మేరకు రాష్ట్రపతి గ్రీవెన్స్‌ సెల్‌కు ఓ లేఖ రాశారు. గతనెల 18న సీతానగరం పోలీసుస్టేషన్‌లో వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తనకు ఎస్‌ఐ శిరోముండనం చేశారని, హింసించారని అందులో వివరించారు. ఈ లేఖ రాష్ట్రపతి సెక్రటేరియట్‌కు చేరిందని, పరిశీలనలో ఉందని స్టేట్‌స్‌లో తెలపడం విశేషం.
 
ఈ లేఖలో 'నేను చాలా పేదకుటుంబానికి చెందిన వాడిని. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించడమే నేను చేసిన తప్పు అయినట్లుంది. 22వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కూడా శిరోముండనాన్ని సీరియ్‌స్‌గా భావిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో ఏడుగురి మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు వేశారు. అందులో 6వ ముద్దాయి ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తికాగా, 7వ ముద్దాయి పోలీసు ఆఫీసర్‌. అతడు సస్పెండ్‌ అయ్యాడు. అంతేకాదు ఎస్‌ఐని అరెస్ట్‌ చేసి, జైలుకు పంపారు. 
 
కానీ 1 నుంచి 6 వరకూ ఉన్న ముద్దాయిలను మాత్రం ఇంతవరకూ అరెస్టు చేయలేదు. వీరే ప్రధాన కారకులు. ఇక్కడ ఎస్‌ఐ కేవలం ఉద్యోగంలో చేరి 48 గంటలు అయింది. ఆయనకూ, నాకూ వ్యక్తిగత గొడవలు ఏమీ లేవు. శిరోముండనం విషయాన్ని జిల్లా కలెక్టర్‌, రాజమహేంద్రవరం ఎస్‌పీ కూడా పట్టించుకోవడంలేదు. ముద్దాయిలను అరెస్ట్‌ చేయలేదు. నాకు ఏవిధమైన సహాయమూ చేయలేదు. నేను దళితుడిని కావడం వల్లే న్యాయం జరగడంలేదు. నేను పరువు కాపాడుకుంటాను... దయవుంచి నక్సల్స్‌లో చేరడానికి నాకు అనుమతి ఇవ్వండి. ఇక్కడ శాంతిభద్రతలు విఫలమయ్యాయి' అని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఈ లేఖ చేరిన 24 గంటల్లో రాష్ట్రపతి కార్యాలయం స్పందించడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగానికి ఈ కేసుకు సంబంధించిన ఫైల్ బదిలీ అయింది. అసిస్టెంట్ సెక్రటరీ జనార్థన్ బాబును కలవాలని బాధితుడు ప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. పూర్తి వివరాలు, కాల్ రికార్డ్స్, వీడియో క్లిప్పింగులు జనార్థన్ బాబుకు అందించాలని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments