పీకే దూడుకు... సోనియా గాంధీతో వరుస భేటీ

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (13:53 IST)
జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దూకుడు పెంచారు. గత మూడు రోజుల్లో ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో రెండుసార్లు సమావేశమయ్యారు. 2024లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు.. వివిధ రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై వారు చర్చించినట్టు సమాచారం. 
 
నిజానికి గత శనివారం సోనియా, ప్రశాంత్ కిషోర్‌ల మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా మిషన్ 2024పై ఆయన విశ్లేషణాత్మకమైన ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని, గెలుపు కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు.
 
ముఖ్యంగా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. యూపీ, ఒడిశా, బీహార్‌లో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని తెలిపారు. మరోవైపు పీకే సూచనలపై ఈ నెలాఖరున కాంగ్రెస్ పార్టీ స్పందించే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, పీకేతో భేటీకి ముందు పార్టీ సీనియర్ నేతలైన చిదంబరం, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్ వంటి కీలక నేతలతో సోనియా సమావేశమయ్యారు. ఈ సమావేశం నాలుగు గంటలకు పైగా కొనసాగింది. ఈ సమావేశానికి రాహుల్ దూరంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments