Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతతో స్నేహం... మొసలితో ముద్దులు.. ఇదే ఆమ్టే ఫ్యామిలీ లోకం (Video)

సాధారణంగా చిన్నపాటి పామును చూస్తేనే కంగారుపడి ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటి ఏకంగా వంద రకాల క్రూర జంతువుల మధ్య రేయింబవుళ్ళు గడపడం అంటే కలలో కూడా ఊహించుకోలేం. కానీ, ఆ కుటుంబానికి మాత్రం ఇది సాధ్యం.

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (10:56 IST)
సాధారణంగా చిన్నపాటి పామును చూస్తేనే కంగారుపడి ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటి ఏకంగా వంద రకాల క్రూర జంతువుల మధ్య రేయింబవుళ్ళు గడపడం అంటే కలలో కూడా ఊహించుకోలేం. కానీ, ఆ కుటుంబానికి మాత్రం ఇది సాధ్యం. చిరుత పులితో స్నేహం, మొసలితో ముద్దులు, తెల్లపులికి మసాజ్ చేయడం వారికి అలవాటు. కేవలం పెద్దవారే కాదు.. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు కూడా అతి భయంకరమైన క్రూర జంతువులతో అట్లాడుకుంటున్నారు. 
 
ఆ కుటుంబ సభ్యులు ఎవరో కాదు. ప్రముఖ సామాజికవేత్త, రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత బాబా ఆమ్టే కుమారుడు డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, ఆయన భార్య మందాకిని ఆమ్టే. ఈ దంపతులతో పాటు వీరి కుటుంబ సభ్యులంతా క్రూర మృగాల మధ్యే జీవనం సాగిస్తున్నారు. ఈ మృగాల ఆలనాపాలనే వారి జీవితం. ఇందుకోసం వారు ఆమ్టే అనిమల్ ఆర్క్ అనే పేరుతో ఓ పార్కును స్థాపించారు. ఇది మహారాష్ట్రలోని హేమల్కాసా అనే ఏరియాలో ఉంది. 
 
తండ్రిలాగా ప్రకాష్ ఆమ్టే కూడా సంఘ సేవకుడే. ఆయన ఒక రోజున నడిచి వెళుతుండగా, కొంతమంది గ్రామస్తులు ఒక కోతిని తాళ్లతో బంధించి, కర్రకు కట్టేసి మోసుకొస్తున్న దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యం ఆయనను ఎంతగానో కలిచివేసింది. వెంటనే గ్రామస్తులకు కొంత డబ్బు ఇచ్చి ఆ కోతిని వదిలిపెట్టించారు. అపుడే మూగ జంతువుల సంరక్షణకు ఆయన నడుంబిగించారు. ఫలితంగానే ఆమ్టే అనిమల్ ఆర్క్ పునాదులు పడ్డాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments