Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటిరోజు శోభనాన్ని పోర్న్ వీడియోలో చూసి షాకైన భర్త, భార్యకు చూపించాడు

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (15:45 IST)
తొలిరేయి ఎంతో ఉత్సాహంగా తనువులాటలో మునిగిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట వారి తతంగమంతా పోర్న్ వెబ్‌సైట్లో ప్రత్యక్షమయ్యేసరికి నిర్ఘాంతపోయింది. ఈ దారుణం ఎలా జరిగిందో తెలీక తలలు పట్టుకున్నారు. ఎవరైనా తమ గదిలో సీక్రెట్ కెమెరా పెట్టేరేమోనని గది మొత్తం వెతికినా ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు ట్విస్ట్ బయటపడింది. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన యువతీ యువకుడు కొద్దిరోజుల క్రితం ఘనంగా వివాహం చేసుకున్నారు. తర్వాత సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఫస్ట్‌నైట్‌లో ఎన్నో మధురానుభూతులను మూటగట్టుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఆ యువకుడు తన సెల్‌ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వీడియోను క్లిక్ చేసి షాకయ్యాడు. అందులో ఫస్ట్‌నైట్ రోజు తన భార్యతో సెక్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించడంతో నిర్ఘాంతపోయి ఈ విషయాన్ని భార్యకు చెప్పాడు. 
 
ఈ వీడియో ఎవరు తీశారో, ఎలా తీశారో అర్ధంగాక తలలు పట్టుకున్నారు. బెడ్రూమ్‌లో ఎవరైనా సీక్రెట్ కెమెరాలు పెట్టారేమోనని అణువణువూ వెతికినా ప్రయోజనం కనిపించలేదు. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని ఎంతో మదనపడ్డారు. చివరికి ధైర్యం చేసి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. 
 
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి అసలు నిజాన్ని కనుగొన్నారు. దీంతో ఆశ్చర్యపోవడం ఆ దంపతుల వంతైంది. వారి బెడ్రూమ్‌లో ఉన్న స్మార్ట్‌ టీవీలో ఇన్‌బిల్డ్ కెమెరా ఉన్న విషయాన్ని సైబర్ నిపుణులు గుర్తించారు. దానికి వైఫై కనెక్ట్ అయి ఉండటంతో ఓ వ్యక్తి దాన్ని హ్యాక్ చేశాడు. దీంతో వారి శోభనం రోజు దృశ్యాలను టీవీ కెమెరాతో రికార్డ్ చేసి దాన్ని పోర్న్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసినట్లు తేల్చారు. ఈ తతంగమంతా విదేశాల నుంచి జరిగినట్లు తేలడంతో బాధితులు ఆశ్చర్యపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం