Webdunia - Bharat's app for daily news and videos

Install App

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు : కేంద్ర నివేదిక

ఠాగూర్
మంగళవారం, 13 ఆగస్టు 2024 (13:56 IST)
దేశ జనాభా నానాటికీ పెరిగిపోతుంది. వచ్చే 2036 నాటికి భారతదేశ జనాభా 152.3 కోట్లకు చేరుకుంటుందని కేంద్రం తెలిపింది. "విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023" నివేదిక వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5 శాతంగా ఉన్న మహిళల జనాభా 2036 నాటికి కాస్త మెరుగుపడి 48.8 శాతానికి చేరుకోనుందని తెలిపింది. అయితే, 2011తో పోలిస్తే 2036లో 15 ఏళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న వారి నిష్పత్తి తగ్గుతుందని అంచనా వేసింది. సంతానోత్పత్తి క్షీణతే ఇందుకు కారణంగా పేర్కొంది.
 
ఇక, 60 ఏళ్లు, అంతకు పైబడినవారి జనాభా నిష్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. 2011తో పోలిస్తే 2036 జనాభాలో మహిళల నిష్పత్తి కాస్త పెరుగుతుందని వెల్లడించింది. 2011లో 943గా ఉన్న మహిళల నిష్పత్తి 2036లో 952కు చేరుకోనుందని వెల్లడించింది.
 
2016 నుంచి 2020 వరకు 20-24 ఏళ్ల వారిలో సంతానోత్పత్తి శాతం 135.4 శాతం నుంచి 113.6 శాతానికి, 25-29 ఏళ్లున్న వారిలో 166 శాతం నుంచి 139.6 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 35-36 ఏళ్ల వయస్సు వారిలో 32.7 శాతం నుంచి 35.6 శాతానికి తగ్గింది. జీవితంలో స్థిరపడిన తర్వాతే సంతానం గురించి ఆలోచిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా ఈ నివేదిక తెలిపింది.
 
2020లో కౌమార సంతానోత్పత్తి రేటు నిరక్షరాస్యుల్లో 33.9 శాతం కాగా, అక్షరాస్యుల్లో 11 శాతంగా ఉంది. శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొంది. ఎప్పుడూ మగ పిల్లల కంటే ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ 2020కి వచ్చేసరికి ప్రతి 1000 మందిలో 28 మరణాలతో ఆడ, మగ సమానంగా నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)

ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్

"టాక్సిక్" కోసం వందలాది చెట్లను నరికేసారు.. కేజీఎఫ్ హీరోపై కేసు

బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ డాకూ మహరాజ్ - తాజా అప్ డేట్ !

ఆగమ్ బా యూట్యూబర్ గోల్డ్ ప్లే బటన్‌ను అన్ బాక్స్ చేసిన తరుణ్ భాస్కర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం