Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి వివాదం: అమ్మాయిని లోబరుచుకుని గర్భవతిని చేసిన ఎస్సై.. ఆపై వేరొక అమ్మాయితో?

రక్షించాల్సిన పోలీసే కాటేశాడు. నమ్మించి మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతిని రెండుసార్లు గర్భవతిని చేశాడు. అయితే ఆపై తన విశ్వరూపం చూపించాడు. గర్భం తీయించుకోవాలని కొట్టి వేధించాడు. అంతటిత

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (11:18 IST)
రక్షించాల్సిన పోలీసే కాటేశాడు. నమ్మించి మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతిని రెండుసార్లు గర్భవతిని చేశాడు. అయితే ఆపై తన విశ్వరూపం చూపించాడు. గర్భం తీయించుకోవాలని కొట్టి వేధించాడు. అంతటితో ఆగకుండా భారీ కట్నంతో మరో పెళ్ళికి రెడీ అయిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గంగాపురానికి చెందిన ఎం.అరుణ (27) బీఏ, బీఈడీ చదివింది. వీరి కుటుంబానికి గ్రామంలోని వేరే కుటుంబంతో ఆస్తి వివాదం ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరిస్తానని.. న్యాయం చేస్తానని రామకుప్పం ఎస్సైగా పనిచేస్తున్న సునీల్ కుమార్ మాయమాటలు చెప్పాడు. ఆస్తి వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అరుణ నెంబర్ తీసుకుని తన నెంబర్ ఇచ్చాడు. ఆపై ఆమెకు ఫోన్లు చేస్తూ.. ఆమెను మాయమాటలతో మభ్యపెట్టి లోబరుచుకున్నాడు. తని మాటలను గుడ్డిగా నమ్మిన అరుణ... కొన్ని రోజుల తర్వాత గర్భవతి అయింది. 
 
ఆ సమయంలో గర్భం పోవడానికి మాత్రలు తెచ్చి మింగించాడు. రెండోసారి కూడా అరుణ గర్భం దాల్చింది. అయితే సునీల్  రెండోసారి కూడా గర్భస్రావం చేయించుకోవాల్సిందిగా ఒత్తిడి చేశాడు. ఇందుకు అరుణ నిరాకరించింది. అయినా సునీల్ ఆమెను వదల్లేదు. గర్భస్రావం చేయించుకోవాల్సిందిగా కొట్టాడు. ఆపై భారీ కట్నంతో వేరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో చేసేది లేక అరుణ డీఎస్పీ శంకర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న డీఎస్పీ దర్యాప్తు చేస్తామని చెప్తుండగానే.. తనపై విచారణ ఆపాలంటూ హైకోర్టు నుంచి సునీల్ స్టే తెచ్చుకున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం