Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరి ఎలా వేస్తారో భార్యకు డెమో చూపించిన గోవింద్.. నవ్వుతూ కూర్చొన్న భార్య.. తర్వాత ఏం జరిగింది?

ఉరి ఎలా వేసుకుంటారు అని భార్యకు చూపించాలని ప్రయత్నించి చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకున్నాడు ఓ భర్త. వినడానికే వింతగా ఉన్నా ఇది పచ్చి నిజం. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ముంబైకి చెందిన గోవింద్ పోలీస

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (11:47 IST)
ఉరి ఎలా వేసుకుంటారు అని భార్యకు చూపించాలని ప్రయత్నించి చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకున్నాడు ఓ భర్త. వినడానికే వింతగా ఉన్నా ఇది పచ్చి నిజం. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ముంబైకి చెందిన గోవింద్ పోలీసు శాఖలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన గోవింద్‌తో... అతని భార్య బట్టలు ఉతికాను.. వీటిని ఆరేడానికి తాడు కట్టండి అని అతడి చేతికి తాడిచ్చింది. 
 
భార్య చెప్పినట్టుగానే తాడు కట్టాడు. వెర్రి వెయ్యి రకాలు కదా... ఇంతలో గోవిందుకి ఒక వింత ఆలోచన కలిగింది. పోలీసుశాఖలో ఉరి ఎలా వేస్తారో చూపిస్తా... అని చెప్పి డెమో ఇవ్వడం ప్రారంభించాడు. ఒక కొక్కానికి చీర కట్టేసి అందులో తలపెట్టాడు. అయితే ప్రమాదవశాత్తూ అతను వేసుకున్న స్టూల్ పక్కన పడిపోయింది.. అంతే గొంతు బిగుసుకుపోయి గిల గిలా కొట్టుకోవడం మొదలు పెట్టాడు.. దీన్ని చూసిన భార్య ఊరికే చేస్తున్నాడులే అనుకుని నవ్వుతూ కూర్చుంది.
 
అయితే ఎంత సేపైనా దిగకపోవడంతో అనుమానం వచ్చిన భార్య గట్టిగా అరుస్తూ కేకలు పెట్టింది. దీంతో ఏమైందో ఏమోనని పక్కింటి వారు ఉరుకులు పరుగులు మీద వచ్చారు. ఇరుగుపొరుగు వారు వచ్చిన వెంటనే ఆ చీరను కత్తిరించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోవింద్ అపస్మారక స్థితిలో ఉన్నాడని వైద్యులు అంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

కాలేజీ రోజుల్లో హిచ్ కాక్ సినిమాలు చూసేవాడిని : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments