Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో వ్యభిచారం : యువతుల జీతం నెలకు రూ.7 లక్షలు.. ఫ్లైట్‌లో రాకపోకలు

దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన చెన్నై నగరంలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతోంది. ముఖ్యంగా.. ఇక్కడి నక్షత్ర హోటల్స్‌లో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (08:31 IST)
దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన చెన్నై నగరంలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతోంది. ముఖ్యంగా.. ఇక్కడి నక్షత్ర హోటల్స్‌లో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఈ వ్యభిచార వృత్తిలో నిమగ్నమయ్యే యువతులకు ఇచ్చే వేతనం ఎంతో తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ అదిరిపోవాల్సిందే. 
 
నగరంలో హత్యలు, చైన్‌స్నాచింగ్‌ తదితరాలను నిరోధించేందుకు పోలీసు శాఖ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వ్యభిచారాన్ని కూడా అడ్డుకొనే దిశగా వ్యభిచార నిరోధక శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై దాడిచేసి బ్రోకర్లతో పాటు యువతులను అదుపులోకి తీసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో ఆ శాఖ ఇన్‌స్పెక్టర్ బుల్లెట్‌ రాజేశ్వరి, శంకర నారాయణన్ నేతృత్వంలో మంగళవారం రాత్రి ఓ ప్రముఖ హోటల్లోనూ, ఎంఆర్‌సీ నగర్‌లోని ఓ ప్రముఖ వ్యక్తి ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో నలుగురు యువతులు సహా దిలీప్‌సింగ్‌, ఫైజల్‌ అనే బ్రోకర్లను అదుపులోకి తీసుకుని విచారించడంతో పలు విషయాలు వెలుగుచూశాయి. 
 
ముంబై, కోల్‌కతా తదితర నగరాలకు చెందిన యువతులకు నెలకు రూ.7 లక్షల రూపాయలు ఇస్తామని బ్రోకర్లు చెప్పారు. వారిని విమానం ద్వారా నగరానికి రప్పిస్తున్నారు. అనంతరం వారిని తిరిగి విమానం ద్వారా వారిని పంపుతున్నట్లు విచారణలో తేలింది. వీరు ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నట్లు, యువతులను కారులో పంపడం లేదా హోటళ్లల్లో వ్యభిచారం సాగిస్తున్నట్లు తేలింది. వ్యభిచారాన్ని అరికట్టేలా తనిఖీలను ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం