Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దును సర్జికల్ దాడులతో ఎలా పోల్చుతారు : బీజేపీ నేతలపై మోడీ ఫైర్

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దును సర్జికల్ దాడులతో ఎలా పోల్చుతారని సొంత పార్టీ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇందులో ఆ

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (10:35 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దును సర్జికల్ దాడులతో ఎలా పోల్చుతారని సొంత పార్టీ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దును కరెన్సీపై సర్జికల్‌ దాడిగా బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నిలిపివేయాలని సూచించారు. 
 
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో శత్రు శిబిరాలను కనుగొని ధైర్య సాహసాలతో ఒక్కరు కూడా మరణించకుండా చేసిన మిలటరీ ఆపరేషన్‌తో పెద్దనోట్ల రద్దును పోల్చడం సమంజసం కాదన్నారు. ఇలాంటి ప్రచారం భారత జవాన్ల సేవలను కించపరిచినట్టే అవుతుందని, అందువల్ల ఆ తరహా ప్రచారం తక్షణం మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఇకపోతే.. దేశ వ్యాప్తంగా త్వరలోనే నగదు  రహిత సేవలు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం 2.6 లక్షల మంది రైల్వే టిక్కెట్లును కొనుగోలు చేస్తుంటే అందులో 56 శాతం ఈ-టిక్కెట్లే ఉన్నాయని, త్వరలో 100కు 100 శాతం ఈ-టిక్కెట్ల విధానం వస్తుందన్నారు. తమ బంగారు భవితకు నాంది పడిందని పేద ప్రజలు భావిస్తున్న తరుణంలో వారిని ప్రతిపక్షాలు గందరగోళంలోకి నెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments