Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 'సంక‌ల్ప్ ప‌ర్వ'గా ఆగస్టు 15వ తేదీ : నరేంద్ర మోడీ

ఇకపై ఆగస్టు 15వ తేదీని సంకల్ప్ పర్వగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మన్ కీ బాత్‌లో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ... సంక‌ల్ప్ పర్వగా ఆగ‌స్టు 15వ తేదీని జ‌రుపుకొని... దేశంలో నాట

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (15:31 IST)
ఇకపై ఆగస్టు 15వ తేదీని సంకల్ప్ పర్వగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మన్ కీ బాత్‌లో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ... సంక‌ల్ప్ పర్వగా ఆగ‌స్టు 15వ తేదీని జ‌రుపుకొని... దేశంలో నాటుకుపోయిన అవినీతి, పేద‌రికం, ఉగ్ర‌వాదం, అప‌రిశుభ్ర‌త, కుల‌త‌త్వం, మతతత్వాన్ని రూపుమాపుతామ‌ని ప్ర‌తి భార‌తీయుడు ప్ర‌తిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఆగస్టు 9వ తేదీ నాటికి క్విట్ ఇండియా ఉద్యమం జ‌రిగి 75 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా మ‌న‌మంతా వేడుక‌లు చేసుకోవాల‌న్నారు. ఆగ‌స్టు నెల అంటేనే ఉద్య‌మ చ‌రిత్ర గ‌ల నెల అని.. భార‌త‌దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు ఆగ‌స్టులోనే ప్రారంభ‌మ‌య్యాయ‌ని ఆయన గుర్తు చేశారు.
 
ప్రతి యువ‌త ఖ‌చ్చితంగా భార‌త దేశ చరిత్రను చ‌ద‌వాల‌న్నారు. 1857 నుంచి 1942 మ‌ధ్య కాలంలో భార‌త‌దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన గొప్ప స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల గురించి యువ‌త తెలుసుకుంటే.. భ‌విష్య‌త్తులో ఖ‌చ్చితంగా గొప్ప దేశంగా భార‌త్‌ను నిర్మించ‌డంలో యువ‌త పాలుపంచుకుంటుంద‌న్నారు. 
 
ఎన్ని జ‌న‌రేష‌న్లు మారినా.. దేశ అభివృద్ధి కోసం చేయాల్సిన సంక‌ల్పం మాత్రం ఒక్క‌టే అని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టంచేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంటలు కోల్పోయిన చోట వెంటనే బీమా అందేలా చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. అసోం, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్‌లో వరదలు తీవ్ర ప్రభావం చూపాయాని మోడీ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments