Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రదాడికి పాల్పడిన వారికి.. కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు : ప్రధాని మోడీ హెచ్చరిక

ఠాగూర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (14:23 IST)
పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారికి, వారి వెనుక ఉన్న కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు హెచ్చరించారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి భారతదేశ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నట్టు తెలిపారు. దీని వెనుక ఉన్న కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. బాధితుల కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. 
 
ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం అయిన మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్‌లో జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడుని కలిచివేసిందన్నారు. 'ఈ రోజు మీతో నా మనసులోని మాటను పంచుకుంటున్నన వేళ, నా హృదయం తీవ్ర వేదనతో నిండివుంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్ని గాయపరిచింది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడు తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడే వారైనా ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నాను' అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments