Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రాష్ట్రపతిగా ఎల్కే.అద్వానీ?... సన్నిహితుల వద్ద మోడీ ప్రస్తావన!

భారత తదుపరి రాష్ట్రపతిగా లాల్‌కృష్ణ అద్వానీ నియమితులు కానున్నారా? దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమనుకుంటున్నారు? ఈ విషయంపై ఇపుడు సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (20:39 IST)
భారత తదుపరి రాష్ట్రపతిగా లాల్‌కృష్ణ అద్వానీ నియమితులు కానున్నారా? దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమనుకుంటున్నారు? ఈ విషయంపై ఇపుడు సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. 
 
గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపినట్లు సమాచారం. ఈ సమావేశానికి అద్వానీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేశూభాయ్ పటేల్‌ కూడా హాజరయ్యారట. రాష్ట్రపతి పదవిని గురు దక్షిణగా సమర్పిస్తానని ప్రధాని మోడీ చెప్పినట్లు వినికిడి. 
 
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ శాసనసభల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గోవా, మణిపూర్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతుంది. ఫలితంగా రాష్ట్రపతిగా తనకు నచ్చిన నేతను గెలిపించుకోగలిగే సామర్థ్యం ఆ పార్టీకి లభించనుంది.
 
దీంతో ప్రణబ్ ముఖర్జీ స్థానంలో అద్వానీని ఎంపిక చేసి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ముఖ్యంగా.. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిందనే అపవాదు ఉంది. దీన్ని పోగొట్టుకునే విధంగా అద్వానీని రాష్ట్రపతిగా ఎంపిక చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments