PM Modi: జాతిపిత, లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులు

సెల్వి
గురువారం, 2 అక్టోబరు 2025 (09:47 IST)
Gandhi
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. వీరి అడుగుజాడల్లో భారతదేశం నడుస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి మోదీ నివాళులు అర్పించారు. 
 
గాంధీ జయంతి అహింసకు సంకేతమని పునరుద్ఘాటించారు. ఇది గాంధీజీ శాంతి, నైతిక జీవన తత్వాన్ని గౌరవించడమే కాక, అంతర్జాతీయ అహింస దినంగా కూడా పనిచేస్తుంది. అతని సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎక్స్ ద్వారా ప్రధాని పేర్కొన్నారు.  
 
అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి ఆయనను అసాధారణమైన రాజనీతిజ్ఞుడుగా అభివర్ణించారు.
 
అక్టోబర్ 2, 1904న, జన్మించిన శాస్త్రి జవహర్‌లాల్ నెహ్రూ మరణం తరువాత 1964లో శాస్త్రి భారత రెండవ ప్రధానమంత్రిగా ఎదిగారు. తన చారిత్రాత్మక నినాదం 'జై జవన్, జై కిసాన్' కోసం అతను అమరత్వం పొందారు. తరతరాలుగా కొనసాగుతున్న సైనికులు, రైతులకు అండగా నిలిచారు. 
 
సాధారణ పౌరులతో వినయం, నిజాయితీ, లోతైన బంధానికి పేరుగాంచిన శాస్త్రి నాయకత్వం భారతదేశం రాజకీయ, సామాజికతపై శాశ్వత ప్రభావాన్ని చూపిందని ప్రధాని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments