నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (12:51 IST)
దేశంలోని నిరుద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా, 10 లక్షల ఉద్యోగాల నియామకాలకు అనుకూలంగా ఆదేశాలు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖలు, విభాగాల పరిధిలో మానవవనరుల పరిస్థితులపై ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీచేశారు. 
 
"మిషన్ మోడ్‌లో వచ్చే యేడాదిన్నర కాలంలో 10 లక్షల మంది నియామకాలు చేపట్టాలి" అంటూ ప్రధాని ఆదేశించారని ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ పోస్టులను వచ్చే 18 నెలల కాల వ్యవధిలో భర్తీ చేయనున్నారు. 
 
దేశంలో నిరుద్యోగ శాతం విపరీతంగా పెరిగిపోయింది. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్ష నేతల నోటికి తాళం వేసేలా 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. 
 
కేంద్రం మెడలు వంచే ఛాన్స్ ఇది.. వదులుకోవద్దు.. సీఎం జగన్‌కు హర్షకుమార్ వినతి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments