Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలు - ఎమ్మెల్యేలకు మోడీ షాక్.. బ్యాంకు ఖాతా వివరాల వెల్లడికి ఆదేశం

దేశంలోని నల్లకుబేరులకు షాకిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇపుడు.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు తేరుకోలేని షాకిచ్చారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగిన విషయం తెల్సిందే. ఈ నోట్ల రద్దు

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (12:42 IST)
దేశంలోని నల్లకుబేరులకు షాకిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇపుడు.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు తేరుకోలేని షాకిచ్చారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగిన విషయం తెల్సిందే. ఈ నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా కరెన్సీ నోట్లతో పాటు.. చిల్లర కష్టాలు ఉత్పన్నమయ్యాయి.  
 
పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ‍్మెల్యేలు అందరూ తమ బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 31 వరకు తమ బ్యాంకు లావాదేవీల వివరాలను జనవరి 1న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు సమర్పించాలని సూచించారు. అలాగే బీజేపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లంచాలని ఆదేశించారు.
 
ఈ నెల 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు డిసెంబర్‌ 31 వరకు గడువు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ‍్యంలో పారదర్శకంగా ఉండేందుకు బీజేపీ చట్టసభ సభ్యులు బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని మోడీ ఆదేశించినట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments