Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త శక్తిగా అవతరించాం - ఏ దేశానికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (13:06 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో) మిషన్ శక్తి పేరుతో ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏ-శాట్)ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన భారత్ చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మిషన్‌ శక్తి'తో భారత్‌ కొత్త చరిత్ర లిఖించిందన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్‌) ప్రయోగంతో అంతరిక్షంలోనూ తిరుగులేని శక్తిగా అవతరించిందని చెప్పారు. ఆ క్షిపణి కేవలం మూడు నిమిషాల్లో దిగువ కక్ష్యలోని ఓ ఉపగ్రహాన్ని కూల్చివేసిందని వెల్లడించారు. ఈ విజయంతో అంతరిక్ష సామర్థ్యంలో అమెరికా, రష్యా, భారత్‌, చైనా సరసన నిలిచామని వెల్లడించారు.
 
'భూమి, నీరు, గాలిలోనే కాదు ఇప్పుడు అంతరిక్షంలోనూ మనను మనం రక్షించుకోగలం. ఇది మనమంతా గర్వించాల్సిన క్షణం' అన్నారు. ఏ-శాట్‌ ఏ దేశానికీ వ్యతిరేకం కాదని, ఆత్మరక్షణకు మాత్రమేనని తెలిపారు. ఏశాట్‌ ప్రయోగం అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను ఉల్లంఘించదని స్పష్టం చేశారు. భారత్‌ ఎలాంటి లక్ష్యాలనైనా సాధించగలదని మరోమారు నిరూపించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments