Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేసిన ఎడప్పాడి - విజయన్

Webdunia
సోమవారం, 3 మే 2021 (12:08 IST)
ఆదివారం వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో తమిళనాడులో అధికార మార్పిడి జరుగగా, కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. 
 
ఈ క్రమలో ఎన్నిక‌ల్లో చ‌రిత్ర సృష్టించిన ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ సోమ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. సీపీఐ (ఎం) రాష్ట్ర సెక్ర‌టేరియ‌ట్ మంగ‌ళ‌వారం స‌మావేశంకానుంది. కొత్త మంత్రివ‌ర్గంతోపాటు విజ‌య‌న్ మ‌రోసారి సీఎంగా ప్ర‌మాణం చేస్తారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వం ఈ నెల 7 నుంచి 10వ తేదీ మ‌ధ్య ఉండే అవ‌కాశం ఉంది.
 
కేర‌ళ‌లో 140 స్థానాల‌కుగాను ఎల్డీఎఫ్ 99 స్థానాల్లో గెలిచి తిరుగులేని మెజార్టీ సాధించిన విష‌యం తెలిసిందే. 40 ఏళ్ల చ‌రిత్ర‌ను తిర‌గరాస్తూ కేర‌ళ‌లో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌స్తున్నారు పిన‌ర‌యి విజ‌య‌న్‌. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష యూడీఎఫ్ 41 స్థానాల‌కు ప‌రిమితం కాగా.. బీజేపీ ఖాతా కూడా తెర‌వ‌లేక‌పోయింది. గ‌తంలో ఉన్న ఒక్క స్థానంలోనూ కాషాయ పార్టీ ఓడిపోయింది.
 
మరోవైపు, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి కూడా తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. డీఎంకే కూటమి 157 స్థానాల్లో విజయభేరీ మోగించి, పదేళ్ళ తర్వాత అధికారంలోకి రానుంది. దీంతో సీఎం పదవికి ఎడప్పాడి రాజీనామా చేయనున్నారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నరుకు పంపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments