Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలట్ తప్పిందంతో పాటు.. క్రమబద్ధమైన వైఫల్యం వల్లే కూలింది...

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (17:58 IST)
గత యేడాది కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా దుర్మరణం చెందారు. అయితే, ఈ విమానం కుప్పకూలడానికి పైలట్‌ తప్పిదమే కారణమని తేల్చారు. పైలట్ తప్పిదంతోపాటు క్రమబద్ధమైన వైఫల్యం అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని తాజాగా వెల్లడైన నివేదిక పేర్కొంది. 
 
గత ఏడాది ఆగస్టు 7వ తేదీన కోజికోడ్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ బోయింగ్‌ 737-800 కుప్పకూలిపోయిన విషయం తెల్సిందే. ఈ విమానం దుబాయ్‌ నుంచి వచ్చింది. ల్యాండ్‌ అవుతుండగా రన్‌వే నుంచి జారిపడి లోతైన వాగులో పడిపోయింది. విమానంలో 190 మంది ప్రయాణికులు ఉండగా.. వీరిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు.
 
ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) ఒక నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం, ఎస్‌ఓపీని విస్మరించి పైలట్‌ విమానాన్ని నడిపించాడు. టచ్‌డౌన్ పాయింట్ తర్వాత విమానాన్ని ల్యాండ్ చేశాడు. సగం రన్‌వే దాటిన తర్వాత పైలట్ ల్యాండింగ్ చేశాడు. ఈ సమయంలో ఫ్లైట్‌ను కంట్రోల్ చేయలేకపోయాడు. దాంతో విమానం కుప్పకూలింది. 
 
టేబుల్ టాప్‌ ఎయిర్‌ఫోర్ట అయిన కోజికోడ్‌ విమానాశ్రయం.. కేరళలోని నాలుగు చిన్న విమానాశ్రయాల్లో ఒకటి. టేబుల్‌ టాప్‌ విమానాశ్రయాల్లో వాతావరణం అనుకూలించక ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని నిపుణుల చెప్తున్నారు. అందుకే ఈ ఎయిర్‌పోర్టులో జరిగే ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments