Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిద్వార్ వెళ్లి వస్తుండగా ఘోరం.. 10 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (09:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారణం జరిగింది. హరిద్వార్ వెళ్లి వస్తున్న యాత్రికుల వ్యాను ఒకటి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఫిలిబిత్‌లోని గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగింది. 
 
కొంతమంది భక్తులతో హరిద్వార్ వెళ్లిన డీసీఎం వ్యాను దైవదర్శనం ముగించుకుని తిరిగి తమ సొంతూర్లకు బయలుదేరారు. డ్రైవర్‌తో సహా భక్తులంతా నిద్రమత్తులో ఉండగా వేగంగా వస్తున్న వ్యాను రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి, హైవేపై బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
తీవ్రంగా గాయపడిన ఏడుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృత్తుల్లో ఎక్కువ మంది లక్నోకు చెందినవారే కావడం గమనార్హం. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతేదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments