Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. 35మంది అరెస్ట్

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (17:43 IST)
ఉత్తరప్రదేశ్‌లో 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం.. ఆపై హత్యకు సంబంధించిన కేసులో పోలీసులు 35మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని పిలిభిత్ జిల్లా బర్ఖెరా సమీపంలోని ఓ గ్రామంలో గత శనివారం ఈ ఘటన జరిగింది. సైకిల్‌పై స్కూలుకు వెళ్లిన బాలిక శనివారం సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. 
 
రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంటి నుంచి సుమారు అర కిలోమీటరు దూరంలో అర్ధ నగ్నంగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఆ పరిసరాల్లో సైకిల్, స్కూల్‌ బ్యాగ్, బీరు బాటిళ్లు కనిపించాయి. తమ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్‌ చేసి చంపేశాని ఆ బాలిక కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 
 
ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా.. నిందితులను పట్టుకోలేదని.. తమ బిడ్డకు త్వరగా న్యాయం జరగాలంటే కేసు సీబీఐకి అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఏడీజీ అవినాశ్ చంద్ర స్పందిస్తూ.. ఈ కేసును మొత్తం 12 టీమ్‌లు ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 35 మందిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని ప్రశ్నిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం