Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొసలి వచ్చిందంటే.. పట్టించుకోలేదు.. దాన్ని పట్టుకెళ్లి అటవీశాఖాధికారి ఇంట్లో వదిలేశారు..

అటవీశాఖాధికారుల నిర్లక్ష్యం సామాన్య ప్రజలకు కోపం తెప్పించింది. అంతే మొసలి అటవీశాఖాధికారుల ఇంటి ముందు వదిలిపెట్టేశారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన అధికారుల నిర్లక్ష్యానిక

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (14:22 IST)
అటవీశాఖాధికారుల నిర్లక్ష్యం సామాన్య ప్రజలకు కోపం తెప్పించింది. అంతే మొసలి అటవీశాఖాధికారుల ఇంటి ముందు వదిలిపెట్టేశారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనానిని అద్దం పట్టింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక శివపురి ప్రాంతంలోని బాలి కాలనీ పక్కనే నీటి కొలను ఉంది. అందులో ఓ మొసలికి షికారు కెళ్లాలనిపించిందేమో మెల్లగా కాలనీలోకి ప్రవేశించింది. దాన్ని చూసి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్థానిక అటవీ శాఖ అధికారులకు ఫోన్లు చేసి విషయం చెప్పారు. 
 
అయితే సహాయక సిబ్బంది మొసలిని పట్టుకునేందుకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. గంటలు గడిచినా అటవీశాఖ సిబ్బంది జాడమాత్రం కనబడలేదు. దీంతో ప్రజలంతా ఏకమై.. అధికారికి బుద్ధిచెప్పాలనుకున్నారు. ఇక లాభం లేదనుకుని కాలనీ వాసులే.. ధైర్యం చేసుకుని.. మొసలిని బంధించి.. దాన్ని తీసుకెళ్లి అటవీ శాఖాధికారి ఇంట్లో వదిలిపెట్టేశారు.
 
ప్రజల కష్టం పట్టించుకోలేదు కానీ అధికారి కష్టం పట్టించుకోకుండా ఉండలేరు కదా.. అందుకే సరంజామా అంతా పట్టుకుని క్షణాల్లో హాజరయ్యారు అటవీశాఖ సిబ్బంది. మొసలిని బంధించి తీసుకుపోయారు. అది చూసి ప్రజలు నవ్వుకున్నారు. దీనిని బట్టి ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ సిబ్బంది.. వారి పై అధికారులకంటే ఎంత వేగంతో పనిచేస్తారో తెలుసుకోవచ్చునని ప్రజలు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments