పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (22:28 IST)
Pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్రలో కాకరేపుతున్నారు. మహారాష్ట్ర ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలో పవన్ రోడ్ షో చేస్తే.. ఎంత జనం వస్తుందో.. అంతకంటే ఒకందుకు ఎక్కువే మహారాష్ట్రలో పవన్‌ కోసం రోడ్డుపైకి వచ్చారు జనం. పవన్ కోసం భారీ జనం ఆయన పాల్గొన్న ప్రచార సభల వద్ద, రోడ్లపై కనిపించారు. ఆయన నటించిన సినిమాలను చూశామని, పాటలంటే ఇష్టమని మహారాష్ట్ర ప్రజలే చెప్పారు. 
 
 
ఇకపోతే.. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇప్పటికే డెగ్లూరులో, లాతుర్‌లో ప్రసంగించారు. అయితే.. పవన్ నాందేడ్‌లో ప్రసగించినప్పుడు మరాఠీలో మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను, ఆయన తల్లి జిజియా బాయిని గుర్తు చేసుకున్నారు. 
Pawan kalyan
 
అదే విధంగా బాబా సాహేబ్ అంబేద్కర్, బాల్ థాకరే గారిని స్మరించుకున్నారు. పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో అక్కడి వాళ్లలాగా పగిడిసైతం వేసుకున్నారు. ఇక్కడ హైలేట్ ఏంటంటే.. అనేక చోట్ల పవన్ ఛత్రపతి శివాజీ మహారాజ్‌లా అనేక ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో పవన్ మెనియా.. సనాతన ధర్మం గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన మళ్లీ ట్రెండింగ్‌లో నిలిచారు. 
 
ఇకపోతే.. నవంబర్ 17న చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ సభలో, అదేరోజు సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరధిలో జరిగే రోడ్ షోలో పవన్ పాల్గొంటారు. మొత్తమ్మీద పవన్ 5 సభలు, 2 రోడ్ షోలలో పాల్గొననున్నారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments