దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ పైలట్ తన విధుల్లో నిర్లక్ష్యం వహించాడు. ఫలితంగా 166 మంది ప్రయాణికుల శాపంలామారింది. వీరిలో 30 మంది ప్రయాణికుల పరిస్థితి మరింత ప్రమ
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ పైలట్ తన విధుల్లో నిర్లక్ష్యం వహించాడు. ఫలితంగా 166 మంది ప్రయాణికుల శాపంలామారింది. వీరిలో 30 మంది ప్రయాణికుల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. వీరి చెవులు, ముక్కుల నుంచి రక్తం వచ్చింది. దీంతో మిగిలిన ప్రయాణికులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ వివరాలను పరిశీలిస్తే.. ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న విమానంలో క్యాబిన్‌లోని గాలి ఒత్తిడి(ప్రెజర్)ని కంట్రోల్ చేసే స్విచ్‌ను ఆన్ చేయడాన్ని విమాన సిబ్బంది మర్చిపోయారు. దీంతో, విమానంలో ఒత్తిడి ఏర్పడి, ప్రయాణికులు నరకాన్ని చవిచూశారు. వారి ముక్కు, చెవుల నుంచి రక్తం కారింది. మరికొందరు భరించలేని తలనొప్పితో బాధపడ్డారు. దీంతో విమానాన్ని మళ్లీ ముంబైకి మళ్లించారు. అస్వస్థతకు గురైన ప్రయాణికులను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు.
దీనిపై ప్రయాణికులు స్పందిస్తూ, ఆ సమయంలో విమానంలోని సిబ్బంది కూడా సరిగా వ్యవహరించలేదని, మాస్క్‌లు ధరించాలని సూచించలేదని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. దాదాపు 23 నిమిషాల తర్వాత విమానాన్ని తిరిగి ముంబైలో దించినట్టు తెలిపారు. చెవుల్లోంచి రక్తం కారడంతో తాత్కాలికంగా చెవుడు వచ్చిన ఐదుగురికి చికిత్స అందించి వెంటనే ఆస్పత్రి నుంచి ఇళ్లకు పంపించివేశారు. వారం 10 రోజుల్లో వీరికి పూర్తి స్వస్థత చేకూరుతుందని, ఈలోపు వారు విమాన ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచించారు.