11వ నంబర్ సీటే ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడింది!

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (12:47 IST)
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికుల్లో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా స్వల్పగాయాలతో బయటపడ్డాడు. దీనికి కారణం, కేవలం 11వ నంబర్ సీటే. ఈ ప్రయాణికుడు 11వ నంబర్ సీటులో కూర్చోవడం వల్లే తన ప్రాణాలను రక్షించుకోగలిగాడు. కాగా, 11వ నంబర్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పేరుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపాకు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 175కు 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన వైకాపా నేతలకు 11 నంబరుతో దిమ్మతిరిగిపోయింది. అప్పటి నుంచి 11వ నంబరుకు ఏపీలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 
 
ఇదిలావుంటే, అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి భారత సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నాడో వివరించారు. విశ్వాస్ కుమార్ విమానంలో 11ఏ నంబరు సీటులో ఎడమవైపునకు ఉన్న అత్యవసర ద్వారం పక్కన కూర్చున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం గాల్లోకి ముక్కలైపోయిందని, తన సీటు విమానం నుంచి విడిపోయి దూరంగా ఎగిరిపడిందని ఆయన తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేశ్ వైద్యులతో మాట్లాడుతూ, విమానం ముక్కలైంది. నా సీటు ఊడిపోయింది. అలా నేను ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్పారు. 
 
విమానం ఛిద్రమైనపుడు తాను సీటు బెల్టుతో ఉండగానే బయటకు విసిరివేయబడ్డానని, అంతేగానీ తాను విమానం నుంచి కిందకు దూకలేదని స్పష్టం చేశారు. గాయాలతో బయటపడిన ఆయన ప్రస్తుతం ట్రామా వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్లాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలి పేలిపోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

Ramcharan: ఎ.ఆర్. రెహమాన్.. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్

Monalisa : కుంభమేళా భామ మోనాలిసా కథానాయికగా లైఫ్ చిత్రం ప్రారంభం

Nagarjuna: డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో శివ రీరిలీజ్ - చిరంజీవిలా చిరస్మరణీయం : వర్మ

మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను ఆపిందా? చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments