ట్రేడింగ్ పేరిట మోసం.. పార్ట్ టైమ్ జాబ్ కోసం ఆశిస్తే.. రూ.55 లక్షలు స్వాహా

సెల్వి
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (20:49 IST)
చెన్నైలో మోసం జరిగింది. చెన్నై శివారు ప్రాంతం అయిన అంబత్తూరుకు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి బాలమురుగన్ ఫేస్‌బుక్‌లో పార్ట్‌టైమ్ జాబ్ కోసం ప్రకటన చూసి మోసపోయాడు. వాట్సాప్, టెలిగ్రామ్‌లలో ఇచ్చిన నెంబర్‌కు సంప్రదించి బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో బాలమురుగన్ యూజర్ నేమ్ అండ్ పాస్‌వర్డ్ ఇచ్చారు. అతడికి చాలా బ్యాంకు ఖాతాల్లో డబ్బు ఉండటంతో భారీ స్థాయిలో మోసపోయాడు. 
 
ట్రేడింగ్ పేరిట పెట్టుబడి పెడితే.. ఆ డబ్బుకు వచ్చిన లాభాన్ని తన బ్యాంకు ఖాతాలో జమ చేస్తానని మోసగాళ్లు చెప్పారని నమ్మించారు. ఈ క్రమంలో దాదాపు 55,38,625/- పెట్టుబడి పెట్టాడు. కానీ మోసగాళ్లు చెప్పినట్లుగా బాలమురుగన్‌కు డబ్బు తిరిగి ఇవ్వనందున అతను మోసపోయానని అతను తెలుసుకున్నాడు. 
 
ఆపై ఆవడి పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశాడు. ఆవడి సైబర్ క్రైమ్ విభాగం ఆదేశాల మేరకు ఆవడి పోలీస్ కమిషనర్ కె.శంకర్, ఇ.సి.ఎ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేసి బాలమురుగన్ బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుంటుండగా ఊర్పక్కంకు చెందిన డొమినిక్ అతని ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాలను వాడినట్లు తేలింది. 
 
అతని అరెస్టు సమయంలో దర్యాప్తులో, డొమినిక్, ఢిల్లీకి చెందిన వ్యక్తులు ఢిల్లీలోని మోసగాళ్లకు సహాయం చేయడం ద్వారా అమాయక ప్రజలను మోసం చేశారని తేలింది. డొమినిక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments