Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టులో పార్లమెంట్ సమావేశాలు!

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (17:18 IST)
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను ఏవిధంగా నిర్వహించాలనేది అతిపెద్ద సవాలుగా మారింది. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అనుసరించి ప్రభుత్వ సెంట్రల్‌ హాల్‌లో లోక్‌సభ కార్యకలాపాలను, అలాగే లోక్‌సభ హాలులో ఎగువ సభ కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తున్నారు.

మరోవైపు వర్చువల్ సెషన్‌ నిర్వహించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆగస్ట్‌ రెండో వారంలో కాని, మూడో వారంలో కాని వర్షాకాల సమావేశాలు జరగవచ్చని పార్లమెంట్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ (సిసిపిఎ) సమావేశం అనంతరం ఉభయసభల పనితీరుపై తుది నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. ఇదిలా వుండగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్‌లో జరగవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆదివారం స్పష్టం చేశారు. 
 
కాంగ్రెస్‌ ఎంపిలతో సోనియా చర్చ
రానున్న ప్లారమెంట్‌ సెషన్‌లో లెవనెత్తబోయే ప్రధాన అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా తమ పార్టీ లోక్‌సభ ఎంపిలతో చర్చించారు. లాక్‌డౌన్‌ తర్వాత కరోనాను కట్టడి చేయడంతో వైఫల్యాన్ని, ఇతర అంశాలతో పాటు సరిహద్దు వివాదంపై బిజెపి ప్రభుత్వంపై ప్రశ్నాస్తాలు సంధించేందుకు కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేసుకుంటోంది.

పేదలను ఆదుకునేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలన్న డిమాండ్‌ను మోడీ సర్కార్‌ నెరవేర్చకపోవడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతుండటంపై కూడా బిజెపి ప్రభుత్వాన్ని పార్లమెంట్‌ సెషన్‌లో కాంగ్రెస్‌ లెవనెత్తే అవకాశాలున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments