Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా.. శశికళ చేతిలో లేఖ?

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాజీనామా చేసినట్టు పుకార్లు వస్తున్నాయి. ఆయన రాజీనామా లేఖ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చేతికి ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ధృవీ

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (11:28 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాజీనామా చేసినట్టు పుకార్లు వస్తున్నాయి. ఆయన రాజీనామా లేఖ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చేతికి ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. 
 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రంతో పాటు అన్నాడీఎంకేలో రోజుకోరీతిన జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ లేఖను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు ఇచ్చేశారని మంగళవారం అన్నాడీఎంకే నాయకులు చెప్పారు. జయలలిత మరణించిన తర్వాత అదేరోజు అర్థరాత్రి తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
 
ఇటీవల అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్న ఉదయ్ కుమార్, లోక్‌సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై తదితరులు శశికళ సీఎం కావాలని మీడియా ముందు బహిరంగంగా చెప్పారు.
 
శశికళ కోసం పన్నీర్ సెల్వం తన సీఎం పదవికి రాజీనామా చేసి త్యాగం చేస్తారని వారు అన్నారు. సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా మాట్లాడటంతో విసుగు చెందిన పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేసి ఆ లేఖను శశికళకు ఇచ్చేశారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
 
అయితే ఈ విషయంపై పన్నీర్ సెల్వం కాని, శశికళ కాని ఇప్పటివరకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. శశికళ ఎప్పుడు సీఎం కావాలనుకుంటే ఆ రోజు పన్నీర్ సెల్వం ఇచ్చిన రాజీనామా లేఖను బయటపెడుతారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments