Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరంతో వచ్చిన బాలికపై పాకిస్థాన్ డాక్టర్ లైంగిక దాడి.. అహ్మదాబాద్‌లో...

జ్వరంతో బాధపడుతూ వచ్చిన బాలికపై పాకిస్థాన్ వైద్యుడొకరు లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ దారుణం అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (10:31 IST)
జ్వరంతో బాధపడుతూ వచ్చిన బాలికపై పాకిస్థాన్ వైద్యుడొకరు లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ దారుణం అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... పాకిస్థాన్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ జైరామ్ లడ్హానీ వీసా గడువు పొడిగించుకుని గత నాలుగేళ్లుగా గుజరాత్‌ని అహ్మదాబాద్‌లోని సర్దార్ నగ‌ర్‌‌లో నివాసముంటున్నాడు. 
 
అయితే, ఈయన వద్దకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ 16 యేళ్ళ బాలిక వచ్చింది. ఆ బాలికను పరీక్షించిన జైరామ్... కొన్ని మందులు ఇచ్చి... సాయంత్రం మరోసారి వైద్యపరీక్షలకు రావాలని యువతికి సూచించాడు. దీంతో ఆ సాయంత్రం మరోసారి వెళ్లిన ఆ యువతిపై లైంగికదాడికి జైరామ్ లడ్హానీ ప్రయత్నించాడు. 
 
అతని నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో గతంలో చాలా మంది యువతులపై అత్యాచారయత్నం చేసినట్టు తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత డాక్టర్‌ను అరెస్టు చేస్తామని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం