Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రార్థనా మందిరంపై దాడి... వందమంది ఉగ్రవాదులను హతం చేసిన పాకిస్థాన్

మసీదుపై దాడి చేసి వంద మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై పాకిస్థాన్ విరుచుకుపడింది. సింధ్ ప్రావిన్స్‌లోని లాల్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడికి పాక్ ప్రతీకారం తీర్చుకు

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (10:43 IST)
మసీదుపై దాడి చేసి వంద మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై పాకిస్థాన్ విరుచుకుపడింది. సింధ్ ప్రావిన్స్‌లోని లాల్ ఖలందర్ సూఫీ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడికి పాక్ ప్రతీకారం తీర్చుకుంది. దాడి జరిగిన వెంటనే స్పందించిన పాక్ శుక్రవారం నాటికి వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. 
 
గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 88 మంది మృతి చెందగా 250 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదుల ఏరివేతకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో పాక్ భద్రతా దళాలు దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం వందమంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 
 
మందిరంపై దాడి వెనక ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు గుర్తించిన పాక్ ఆర్మీ 76 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పేర్లున్న జాబితాను ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయానికి అందించి వెంటనే చర్యలు తీసుకోవడమో, లేదంటే తమకు అప్పగించడమో చేయాలని డిమాండ్ చేసింది. కాగా దాడి తమపనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments