Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జీయా కేసుతో లింక్.. చిదంబరం ఇంటిపై సీబీఐ రైడ్

షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విషయంపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

Webdunia
మంగళవారం, 16 మే 2017 (11:41 IST)
షీనా బోరా హత్య కేసులో ఇరుక్కుని జైలులో గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు నిర్వహించిన మీడియా కంపెనీకి లబ్ధి చేకూర్చారనే విషయంపై కేంద్ర మాజీ ఆర్థిక, హోం మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇంటితో పాటు 14 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి.

కార్తీ చిదంబరం సంస్థ 2008లో లంచాలు తీసుకుని ఐఎన్ఎక్స్ మీడియాకు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించినట్లు సీబీఐ వర్గాలు గుర్తించాయి. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఎక్చేంజ్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) నుంచి రూ.4కోట్ల నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. 
 
అయితే ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇప్పించేందుకు కార్తీ చిదంబరం సంస్థ రూ.10 లక్షలు లంచం తీసుకుందని.. ఆపై ఐఎన్ఎక్స్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రూ.305కోట్లను సమీకరించిందని సీబీఐ వర్గాల సమాచారం. ఈ ఒప్పందాలు కుదిరిన సమయంలో మాజీ ప్రధాన మంత్రి  మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారని.. ఈ స్కామ్‌లో పీసీ పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని సీబీఐ వర్గాల సమాచారం.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments