Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఠాగూర్
ఆదివారం, 17 ఆగస్టు 2025 (16:32 IST)
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ప్రముఖ యూట్యూబర్, 'బిగ్ బాస్' ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటన కలకలం రేపింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న ఆయన ఇంటిపై ఈ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 
 
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు దుండగులు ఎల్విష్ యాదవ్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. దాదాపు 25 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు. 
 
కాల్పుల జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ (27) పని నిమిత్తం హర్యానా బయట ఉన్నట్లు తెలిసింది. అయితే, ఆయన కుటుంబ సభ్యులు, ఇంటి కేర్ టేకర్ మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఈ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో ఎల్విష్ కుటుంబం నివాసం ఉంటోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే గురుగ్రామ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
 
సెక్టార్-56 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దుండగులు ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments