Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడప్పాడికి చెక్.. అమ్మ టీవీ 24x7 త్వరలో ప్రారంభం.. జీ టీవీని ఓపీఎస్ కొనేశారా?

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఛానల్ కొనేశారు. ప్రస్తుత తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి చుక్కలు చూపించేందుకు వీలుగా.. ఇప్పటికే ఓ టీవీ ఛానల్‌ను ఓపీఎస్‌ కొనేశారని వార్తలు వస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (16:56 IST)
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఛానల్ కొనేశారు. ప్రస్తుత తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి చుక్కలు చూపించేందుకు వీలుగా.. ఇప్పటికే ఓ టీవీ ఛానల్‌ను ఓపీఎస్‌ కొనేశారని వార్తలు వస్తున్నాయి. గతంలో అమ్మ టీవీ ఛానల్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఓపీఎస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాము కొత్తగా ప్రారంభించే ఛానల్‌కు అమ్మ టీవీ 24x7 న్యూస్ చానల్ అని పేరుపెడుతామని ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గీయులు ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం.. ఆర్కే నగర్ ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత అమ్మ టీవీ ఛానల్‌కు శ్రీకారం చుడుతామని ఓపీఎస్ వర్గీయులు భావిస్తున్నారు. 
 
ఇప్పటికే తమిళనాడులో ప్రసారం అవుతున్న మడిప్పాకం విశ్వనాథంకు చెందిన జీటీవీని పన్నీర్ వర్గీయులు కొనుగోలు చేశారు. ఈ టీవీకి అమ్మ టీవీగా పేరు మార్చేసి అధికారికంగా ప్రసారం చేసేందుకు ఓపీఎస్ అండ్ టీమ్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ టీవీలో శశికళ.. కుటుంబ సభ్యులు అమ్మ జయలలితకు చేసిన ద్రోహాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తారని తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments