Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాది దేశ అజెండా - ప్రతిపక్షాలది పాకిస్థాన్ అజెండా : ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (14:38 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. తమ దేశ అజెండా అని, విపక్ష పార్టీలది పాకిస్థాన్ అజెండా అంటూ ధ్వజమెత్తారు. దేశభక్తి, అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకునే ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంలో ఏర్పాటు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
తాను చేపట్టిన పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఫజిల్కా జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు చూపమంటూ డిమాండ్ చేస్తున్న విపక్ష పార్టీలది పాకిస్థాన్ అజెండా అని ఆరోపించారు. 
 
గతంలో ఒకరు పంజాబ్‌ను గతంలో లూటీ చేశారని, మరొకరు ఇపుడు ఢిల్లీలో కుంభకోణాలకు పాల్పడున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ఒకేతాను ముక్కలేనని, ఇపుడు కుస్తీపట్టినట్టు డ్రామాలు ఆడుతాయని ఎద్దేవా చేశారు. 
 
అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ సోదరులను రావొద్దన్న పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీపై ఆయన విమర్శలు చేశారు. గురుగోవింద్ సింగ్ సంత్ రవిదాస్ ఎక్కడ పుట్టారంటూ ఆయన నిలదీశారు. గురుగోవింద్ సింగ్ బీహార్‌లోని పాట్నా సాహిబ్‌లో జన్మిస్తే, సంత్ రవిదాస్ యూపీలోని వారణాసిలో జన్మించారని గుర్తుచేశారు. అంటే ఈ రెండు రాష్ట్రాల ప్రజలను రావొద్దనంటే వారిని అవమానించినట్టేనని ప్రధాని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments