Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగికి మాత్రమే అనుమతి.. అయోధ్య రామాలయ శంకుస్థాపనపై రామజన్మభూమి ట్రస్టు క్లారిటీ

Webdunia
బుధవారం, 29 జులై 2020 (15:18 IST)
అయోధ్యలోని రామాలయం భూమి పూజ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మినహా ముఖ్యమంత్రులకు ఆహ్వానం లేదని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజాగా ప్రకటించింది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించలేదని విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు.

రామాలయం నిర్మాణం కోసం పోరాడిన కీలకవ్యక్తులైన ఎల్ కె అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సాథ్వీ రితంబర, మాజీ సీఎం కల్యాణ్ సింగ్, జై భాన్ సింగ్ పోవాయియాలను భూమి పూజ కార్యక్రమానికి రావాలని ట్రస్టు ఆహ్వానించింది.

రామజన్మభూమి కేసును కోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాదులను కూడా ఈ ఆలయ భూమి పూజా కార్యక్రమానికి పిలిచారు.ప్రధాని మోదీ ముఖ్యఅతిధిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించారు.

15 మంది ఆలయ ట్రస్టు సభ్యులతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కృష్ణ గోపాల్, ఇంద్రేష్ కుమార్, యోగా గురు బాబా రాందేవ్, జగత్ గురు రాంభద్రాచార్య, రాథే రాథే బాబా, యుగ్ పురుష్ ప్రేమానందజీ, విశ్వహిందూపరిషత్ తరపున అలోక్ కుమార్. సదాశివ్ కోక్జే, దినేష్ చంద్ర, ప్రకాష్ శర్మ, భజరంగ్ దళ్ అధ్యక్షుడు మిలింద్ పరాండీ, రాంవిలాస్ వేదాంతి, జితేంద్రనంద్ సరస్వతిలను రామాలయం భూమిపూజా కార్యక్రమానికి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments