Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదిమంది ఎమ్మెల్యేలు జంప్ అయితే పళని ఔట్: డీఎంకె వ్యతిరేక ఓటు కీలకం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి శనివారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకోనందునే ఉత్కంఠకు తెరపడింది. విశ్వాస పరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగానే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (05:51 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి శనివారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకోనందునే ఉత్కంఠకు తెరపడింది. విశ్వాస పరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగానే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా దెబ్బతిందని, ప్రజాజీవనం అతలాకుతలమైందని ఆయన విమర్శించారు. సుస్థిర పాలన కావాలని తాము మొదట్నించీ కోరుతున్నట్టు చెప్పారు. ఇందుకు అనుగుణంగానే పళనిస్వామికు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ నిర్ణయించినట్టు మీడియాకు తెలిపారు. అంతకుముందు స్టాలిన్ అధ్యక్షతన అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో 89 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. 
 
కాగా, డీఎంకే బాటనే కాంగ్రెస్ కూడా ఎంచుకుంది. పళనిస్వామి విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 
 
డీఎంకే ఎమ్మెల్యేలు 89 మంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 మంది, పన్నీర్ సెల్వంకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు 12 మంది మొత్తం 110 ఓట్లు, పళనిస్వామి వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య 124. బలపరీక్షలో నెగ్గడానికి కావలసిన మ్యాజిక్ నెంబర్ 115. అంటే కేవలం 10 మంది శశికళ వర్గం ఎమ్మెల్యేలు అటునుంచి ఇటు జంప్ చేస్తే పళనిస్వామి ప్రభుత్వం పని గోవిందా అయిపోయే అవకాశం. 
 
ఇప్పటికే మైలాపూర్ ఎమ్మెల్యే మాజీ డీజీపీ నటరాజ్ జయ వ్యతిరేకించిన వారికి తాను ఓటెయ్యనని తేల్చి చెప్పేశారు. గోల్టెన్ రిసార్ట్ బేలో విడిది చేసిన ఎమ్మెల్యేల్లో 20 మంది ఇప్పటికే పళనిపై తిరుగుబాటు ప్రకటించారని, అందుకే జైల్లోని శశికళ వద్దకు కాకుండా పళని రిసార్టుకు పరుగెత్తుకెళ్లి బుజ్జగింపు మొదలెట్టారని వార్తలు. మరోవైపు ఒక్కో ఎమ్మెల్యేకి అయిదు కోట్లు ఇస్తామని బేరం కుదుర్చుకుని ఇప్పటికే సగం డబ్బులు ఇచ్చి మిగతా సగం బలపరీక్షలో నెగ్గాక ఇస్తామని పళని వర్గీయులు చెప్పారని కూడా వార్తలు, వీటిలో ఏది నిజమైనా, కాకున్నా, కేవలం పది మంది ఎమ్మెల్యేలు స్థానాలు మారితే పళని ప్రభుత్వం ఔట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
మరో అయిదు గంటల్లో అసెంబ్లీలో జరగనున్న బలపరీక్ష ఎవరి భవితవ్యాన్ని తేల్చిపడేయనుందోనని తమిళనాడు మొత్తం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments