Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసు తిని ఒకరి మృతి.. మరో ఐదుగురు పరిస్థితి విషమం.. ఎక్కడ?

చేపల పులుసు తినిన పాపానికి ఒకరు మరణించగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రుట

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (16:34 IST)
చేపల పులుసు తినిన పాపానికి ఒకరు మరణించగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రుట్టి కుడుమియాన కుప్పం ప్రాంతానికి చెందిన నారాయణ స్వామి రైతు. ఆదివారం రాత్రి నత్తం గ్రామానికి అమ్మకానికి వచ్చిన అరుదైన జాతి చేపలను కొనుగోలు చేశాడు. 
 
ఆ చేపలను ఇంటికి తీసుకెళ్లి భార్యతో పులుసు పెట్టమన్నాడు. నారాయణ స్వామి సతీమణి పార్వతి రుచిగా పులుసు చేసేసింది. ఈ కూరను నారాయణ స్వామి భార్య, మామ పెరుమాళ్, అత్త, చెల్లెలు చేపల పులుసేకుని భోజనం చేశారు. అయితే ఆహారం తీసుకున్నాక కొద్దిసేపటికే వారికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో స్థానికులు ఆస్పత్రిలో ఐదుగురిని చేర్పించారు. 
 
పుదుచ్చేరి ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అయితే చికిత్స ఫలించక పెరుమాళ్ మరణించాడు. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. వీరి అస్వస్థతకు చేపల పులుసే కారణమని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. చేపల వ్యాపారితో పాటు స్థానికుల వద్ద విచారణ చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments